Poonam Kaur: వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్వీట్లు కొన్నిసార్లు సంచలనం అవుతుంటాయి. పూనమ్ కౌర్ కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో ట్వీట్లు చేశారు. కొన్ని సందర్భాల్లో వాళ్లను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయగా మరికొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ల పేర్లను ప్రస్తావించకుండా ట్వీట్లు చేయడం జరిగింది. “నాయకులు స్త్రీని ఏ విధంగా గౌరవిస్తారో అనుచరులు సైతం స్త్రీని అదే విధంగా గౌరవిస్తారు.

నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కొరకు ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు” అని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ కు మరీ ఎక్కువ సంఖ్యలో లైక్స్ రాలేదు.

పూనమ్ కౌర్ ట్వీట్ పూర్తిస్థాయిలో క్లారిటీతో లేకపోవడంతో ఎవరికి తోచింది వాళ్లు అర్థం చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పూనమ్ కౌర్ గురించి కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. మీడియాకు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలకు సైతం పూనమ్ కౌర్ దూరంగా ఉండటం కొసమెరుపు.

పూనమ్ కౌర్ భవిష్యత్తు కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పూనమ్ కౌర్ వయస్సు ప్రస్తుతం 37 సంవత్సరాలు కాగా సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించవచ్చు. పూనమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus