Poonam Kaur: ఏపీ ఫలితాల గురించి పూనమ్ రియాక్షన్ ఇదే.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూడగా ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో 164 అసెంబ్లీ స్థానాలలో, 21 లోక్ సభ స్థానాలలో కూటమి విజయం సాధించిందనే సంగతి తెలిసిందే. ఏపీ ఫలితాల గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రియాక్ట్ కాగా పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా ఏపీ ఫలితాల గురించి రియాక్ట్ కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. “వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు” అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.

అయితే ఏపీ రిజల్ట్స్ గురించి పూనమ్ కౌర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారో లేక నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారో అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పూనమ్ కౌర్ తన పోస్ట్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. వైఎస్ జగన్ వై నాట్ 175 అనే నినాదంతో ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఏపీలో వైసీపీకి కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం దక్కడం గమనార్హం.

వైసీపీకి ఘోరమైన ఫలితాలు రావడంతో పూనమ్ కౌర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారని సమాచారం అందుతోంది. పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. పూనమ్ కౌర్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. పూనమ్ కౌర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. పూనమ్ కౌర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా ఆ పోస్ట్ సంచలనం అవుతుందనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus