Preetha Vijayakumar: ప్రీతా విజయ్ కుమార్ సంపాదన గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

స్టార్ కిడ్స్ కి కొన్ని అడ్వాంటేజ్..లు ఉంటాయి..! సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనిపిస్తే.. ఏదో ఒక క్రేజీ ప్రాజెక్టుతో ఎంట్రీ ఇచ్చేయొచ్చు. తర్వాత నిలబడాలి అంటే మాత్రం టాలెంట్ ఉండాలి. ఒకవేళ నటీనటులుగా సక్సెస్ కాకపోయినా.. ఏదో ఒక పాత్ర..కి దర్శకనిర్మాతలు ఇరికిస్తూనే ఉంటారు. అప్పటికీ సక్సెస్ కాకపోతే.. ఏదో ఒక బిజినెస్ పెట్టుకునే, లేక వాళ్ళ బిజినెస్..లు వంటివి చక్కబెడుతూనో కాలం గడిపేయవచ్చు. సంపాదన గురించి టెన్షన్లు వంటివి ఏమీ ఉండవు.

ఈ లిస్ట్ లో తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె ప్రీతా విజయ్ కుమార్ కూడా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ప్రీతా విజయ్ కుమార్ అందరికీ తెలుసు. ‘రుక్మిణి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ ‘మా అన్నయ్య’ ‘వైఫ్’ ‘ప్రియమైన నీకు’ ‘చందు’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి.

దీంతో తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు. వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూనే మరోపక్క తమ వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతూ ఈమె బాగానే సంపాదిస్తుంది. చెన్నై బీచ్ కి సమీపంలో ‘ప్రీతా ప్యాలెస్’ పేరుతో ఈమెకు ఓ కళ్యాణ మండపం ఉంది.

అలాగే ‘మెట్రో కాఫీ హౌస్’ పేరుతో కొన్ని ఫ్రాంచైజీలు కూడా స్టార్ట్ చేసిందట. అలాగే ఈమెకు ఓ డబ్బింగ్ స్టూడియో కూడా ఉందట. మొత్తంగా ఈమె సంపాదన నెలకు లక్షల్లో ఉంటుందని సమాచారం. అవకాశాలు లేకపోయినా హ్యాపీగా ఈమె (Preetha Vijayakumar) రెండు చేతులా సంపాదించుకుంటుంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus