Actress: దయచేసి మా ఊరు రావద్దు అని చెప్పారు!

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రీతినిగమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఋతురాగాలు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైనటువంటి ప్రీతి ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె (Actress) మాట్లాడుతూ ఏ పాత్రలో అయినా నటించవచ్చు కానీ విలన్ పాత్రలలో నటించడం చాలా కష్టమని తెలిపారు. ఇలా విలన్ పాత్రలలో నటించడం వల్ల బయట కూడా మనల్ని అదే ధోరణిలో చూస్తారని తెలియజేశారు. ఇక ఈమె విలన్ పాత్రలలో నటించడం వల్ల ప్రేక్షకుల నుంచి తనకు ఎదురైన అనుభవాల గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రీతినిగమ్ ఓసారి విజయవాడకు వెళ్ళగా అక్కడ ఒక హోటల్ బాయ్ తన వంక అలాగే చూస్తూ ఉన్నారని అయితే ఆ అబ్బాయి అలా చూడటంతో మొదట్లో తనకు భయం వేసిన వెళ్లి ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాను.

అందుకు ఆ కుర్రాడు మీరు ఫలానా సీరియల్ లో నటిస్తున్నారు కదా మిమ్మల్ని మా నాన్నమ్మ ప్రతిరోజు తిడుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. మరోసారి వైజాగ్ వెళుతుండగా ఓ మహిళ తన వద్దకు వచ్చి మీరు మా వైజాగ్ రాకండి మా ఊరికి వస్తే మిమ్మల్ని కచ్చితంగా కొడతారు అంటూ తనకు చెప్పారని ప్రీతి వెల్లడించారు.

ఇలా నేను చేస్తున్నటువంటి ఈ పాత్రలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటున్నాయన్న సంతోషం వేసినప్పటికీ మరో వైపు తనపై ఇలాంటి అభిప్రాయం ఉందా అన్న బాధ కూడా ఉంటుందని ఈ సందర్భంగా ప్రీతినిగమ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus