Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్ కి సారీ చెప్పింది అందుకే..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లొల్లి ఒక రేంజ్ లో జరిగింది. మూడోవారం ఒకరినొకరు నామినేట్ చేస్కుంటూ షేమ్ ఆఫ్ వాల్ పై ఉన్న టేల్స్ ని వాళ్లపేరు రాసి మరీ బద్దలుకొట్టారు. ఇక్కడే ప్రియ లహరి ఇంకా రవి విషయాన్ని తీస్కుని వచ్చింది. మిడ్ నైట్ మీరు హగ్ చేస్కోవడం నేను చూశానని, మేబీ అది బ్యాడ్ హగ్ అయ్యి ఉండకపోవచ్చు, ఫ్రెండ్లీ హగ్ అయి ఉండచ్చు అని చెప్పింది. ఇక్కడే లహరిని ఉద్దేశ్యించి యవర్ బిజీ విత్ అదర్ మెన్ అని దెప్పిపొడిచే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మిడ్ నైడ్ హగ్ గురించి మాట్లాడింది. దీనికి రవి కూడా ప్రియపై ఫైర్ అయ్యాడు. అసలు మీరు ఎలా చెప్తున్నారో మీకైనా అర్ధం అవుతోందా అంటూ మాట్లాడాడు.

నిజానికి ఈ హగ్ తర్వాత ప్రియతో రవి మాట్లాడాడు. బెడ్ పైన పడుకున్న రవి నాతో లహరి క్లోజ్ అవుతోందని, హౌస్ లో వేరే వాళ్లు ఉన్నా కూడా నాతోనే ఎందుకో ఉంటోందని చెప్పాడు. ఈ సీజన్ తర్వాత యాంకరింగ్ అవుదామని అనుకుంటోందని చెప్పాడు రవి. హౌస్ లో సింగిల్ మాన్ ఇంతమంది ఉన్నారు. అయినా కలిసి భోజనం చేయడం, బ్యాటరీస్ మార్చడం ఇలా పనులు చేస్తోంది. నేను చెప్పలేకపోతున్నా, హర్ట్ అవ్వకుండా చెప్పాలి అంటూ మాట్లాడాడు రవి. ఇదే విషయాన్ని లహరి రవిని వచ్చి నిలదీసింది. దీంతో రవి లహరితో పాటు ప్రియ దగ్గరకి వెళ్లి అసలు సింగిల్ మాన్ అనే మాటే రాలేదక్కా అంటూ ప్లేట్ మార్చాడు. నువ్వు అన్నావ్ బ్రో నాతో అంటూ ప్రియా బాధని దిగమింగుకుంటూ చెప్పింది.

నేను నీతో అంటే ఆర్గ్యూమెంట్ ఎందుకు చేస్తాను అక్కా అంటూ రవి మళ్లీ మాట్లాడాడు. దీంతో వాదన ఇష్టంలేక ప్రియ సైలంట్ గా ఉండిపోయింది. ఆతర్వాత రాత్రి బయటకూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ల అమ్మతో మనసుతోనే మాట్లాడింది. నువ్వేదైతే నేర్పించావో నేను అలాగే ఉన్నాను అమ్మా.. ఏదీ కల్పించి చెప్పలేదు. చూసిందే చెప్పాను. ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు ఇంకేమీ అక్కర్లేదు అంటూ తల్లిని తలచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది ప్రియ. తర్వాత రోజు హౌస్ మేట్స్ అందరికీ సారీ చెప్పింది. గుండెల్లో భారాన్ని దించుకుంటూ లహరికి సైతం సారీ చెప్పింది ప్రియ. నేను చెప్పింది రాంగ్ గా ఉందని నాకు అర్ధమైంది అంటూ బాధపడుతూ సారీ చెప్పింది. మొత్తానికి ప్రియ చేసిన హగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని సైతం తాకాయి. దీనిపై శనివారం నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus