Bigg Boss 5 Telugu: ప్రియ అవుట్…అసలు కారణం ఏంటో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం అనూహ్యంగా ప్రియ ఎలిమినేట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే, అన్ అఫీషియల్ పోలింగ్ లో మాత్రం ప్రియ ప్రతి చోట సేఫ్ జోన్ లోనే ఉంది. కానీ, అనూహ్యంగా ప్రియ బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, ప్రియ ఫ్యాన్స్ మాత్రం ఇది చాలా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని, ఎక్కడ చూసినా సేఫ్ లో ఉన్న వాళ్లని ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అసలు ప్రియ ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అనేది కారణాలు వెతుకున్నారు. గేమ్ పరంగా ఫిజికల్ టాస్క్ లలో పెద్దగా పెర్ఫామన్స్ ఇచ్చింది లేదు. అంతేకాదు, లాస్ట్ రెండు రోజులు ప్రియకి సన్నీ విషయంలో బాగా వ్యతిరేకత వచ్చింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ముఖ్యంగా సన్నీని చెంప పగలగొడతా , చెంపపగిలిపోద్ది అనడం ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు. దీంతో లాస్ట్ రెండు రోజులు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది.

ఇక మరోవైపు అనీమాస్టర్ గుండుసూదిని దక్కించుకుని సన్నీ చేతికి ఇచ్చింది. ఇది ఫ్రెండ్షిప్ అంటే అనుకుంటూ సూది ఇచ్చి వెళ్లిపోయింది. అందుకే అనీమాస్టర్ కి లాస్ట్ డే ఎక్కువగా ఓటింగ్ జరిగింది. ప్రియ లీస్ట్ లోకి వెళ్లిపోయింది. నిజానికి డేంజర్ జోన్ లో వీళ్లిద్దరితో పాటుగా లోబో, ఇంకా కాజల్ కూడా ఉన్నారు. ఇలా అనూహ్యంగా ప్రియ ఎలిమినేట్ అయిపోవడం ప్రియ ఫ్యాన్స్ జిీర్ణించుకోలేకపోతున్నారు. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus