ప్రియమణి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదిహేడేళ్లు అవుతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ కే ఎస్ రామారావు కుమారుడు వల్లభ హీరోగా 2003లో వచ్చిన ఎవడే అతగాడు చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఎక్కువగా సినిమాలు చేసిన ఈ అమ్మడు పరుత్తి వీరన్ అనే తమిళ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసి జాతీయ అవార్డు కూడా గెలుపొందింది. ప్రస్తుతం ప్రియమణి కి పూర్తి స్థాయి హీరోయిన్ గా అంతగా అవకాశాలు రావడం లేదు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ప్రియమణి మెదటిసారి పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో డామినెంట్ ఇండస్ట్రీని ఆమె తప్పుపట్టారు. హీరోయిన్స్ దుర్భర స్థితిపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రియమణి చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పరిస్థితి చాలా ధారుణంగా ఉంటుంది. వారి కష్టానికి సరైన ఫలితం దక్కడం లేదనిచెప్పారు. సౌత్ లో సమంత, అనుష్క, నయనతార వంటి తరాలకు మాత్రమే భారీ పారితోషికం అందుతుంది, వారికి అడిగినంత ఇస్తున్న నిర్మాతలు మిగతా హీరోయిన్స్ కి కనీస రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడం లేదని బాధపడ్డారు.
ఆ ఇచ్చే ఆరా కోరా డబ్బుల కోసం వారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించారు ప్రియమణి. పరిశ్రమలో లైంగిక వేదింపులకు పాల్పడిన వారిని శిక్షించకుండా, గురైన ఆడవాళ్లను హేళన చేస్తున్నారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది, కాకపొతే సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రీ అందుకే అందరి దృష్టి సినీతారలపై ఉంటుంది అన్నారు. ప్రస్తుతం ప్రియమణి వ్యాఖ్యలు పరిశ్రమలో సంచలనంగా మారాయి.