Priyanka Jain: క్యాన్సర్ బారిన పడిన ప్రియాంక జైన్ తల్లి!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె బుల్లితెర నటిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెర నటిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి గ్రాండ్ ఫినాలే వరకు హౌస్ లో కొనసాగారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ఎన్నో వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇక ఈ ఏడాదిలోనే తమ పెళ్లి జరగబోతుంది అంటూ ఈమె అందరికీ శుభవార్తను కూడా తెలియజేశారు. ఇలా తన జీవితం సంతోషంగా ఉండబోతోందన్న తరుణంలో ఒక పిడుగు లాంటి వార్త తనకు తెలిసిందంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి గత కొద్ది రోజులుగా అధిక రక్తస్రావంతో బాధపడుతున్నారని, ఇలా బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నటువంటి తరుణంలో తనని హాస్పిటల్ కి తీసుకెళ్లగా తనకు ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అని వైద్యులు చెప్పినట్లు ఈమె వెల్లడించారు.

తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చినప్పుడే ఈ సమస్య మొదలైంది. అయితే నన్ను సపోర్ట్ చేయడం కోసం అమ్మ హాస్పిటల్ కి కూడా వెళ్లలేదని నేను బిగ్ బాస్ వెళ్లకపోయి ఉంటే బాగుండేదని ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఇక తనని డాక్టర్ వద్దకు తీసుకెళ్తే తన గర్భాశయం తొలగించాలని వైద్యులు చెప్పినట్లు ఈమె తెలిపారు. తనకు సర్జరీ సక్సెస్ అయిందని మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కి వెళ్ళాలి అంటూ ఈమె సూచించారు.

ఇలా సర్జరీ జరిగిన తర్వాత క్యాన్సర్ ప్రమాదం తగ్గే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్టు ఈమె తెలియజేశారు. ఇలా తన తల్లి గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారంటూ ప్రియాంక (Priyanka Jain) షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus