Raashi Khanna: రొటీన్ ఫార్ములా అలవాటు చేసేసారు : రాశిఖన్నా

టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రాశిఖన్నా. తన అందం, నటనతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మిడ్ రేంజ్ హీరోలతో ఆడిపాడింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా అవకాశం దక్కించుకుంది కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా సరైన స్థాయిలో బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ లో అవకాశం దక్కించుకుంది రాశిఖన్నా.

Click Here To Watch NOW

అజయ్ దేవగన్ హీరోగా ‘రుద్ర’ అనే సిరీస్ తెరకెక్కింది. ఇందులో రాశి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సిరీస్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సక్సెస్ ను పురస్కరించుకొని రాశిఖన్నా నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ఆరంభంలో దక్షిణాది వారు తనను గ్యాస్ టాంకర్ అని వెక్కిరించేవారని చెప్పింది.

సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత తను రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని.. తనను అలా మార్చేశారని.. కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం, పక్కకు వెళ్లిపోవడం లాంటి రొటీన్ ఫార్ములాను తనకి సౌత్ ఇండస్ట్రీ అలవాటు చేసిందని.. అందులో తను కూడా పడిపోయానని చెప్పుకొచ్చింది. హీరోయిన్లను టాలెంట్ తో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపునిస్తారని.. అది తనకు నచ్చదని తెలిపింది. కొంచెం తెల్లగా ఉంటే చాలు..

మిల్కీ బ్యూటీ అనేస్తారని.. కానీ అంతకుమించిన టాలెంట్ హీరోయిన్స్ లో ఉంటుందని.. ఇప్పటికైనా దీన్ని సౌత్ ఆడియన్స్ గుర్తించాలని రాశి ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాశి చేసిన ఈ కామెంట్స్ పై సౌత్ ఆడియన్స్ మండిపడుతున్నారు. సౌత్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందంటూ రాశిపై ఫైర్ అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus