తప్పు తెలుసుకుని రీ ఎంట్రీకి రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్ రచన..!

ఇ.వి.వి సత్యనారాయణ గారి దర్శకత్వంలో జె.డి.చక్రవర్తి హీరోగా వచ్చిన ‘నేను ప్రేమిస్తున్నాను’ అనే మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రచన. అటు తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘బావగారు బాగున్నారా’ చిత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.ఆ చిత్రం కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. అందులో హీరోయిన్ కంటే కూడా ఈమెకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈమెకు వరుసగా ‘కన్యాదానం’, ‘రాయుడు’, ‘సుల్తాన్’, ‘మావిడాకులు’,’పిల్ల నచ్చింది’, ‘పెద్ద మనుషులు’,’లాహిరి లాహిరి లాహిరిలో’..

వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.గ్లామర్ తో పాటు మంచి నటన కూడా కనపరిచేది ఈ అమ్మడు. అయితే సడెన్ గా ఈమె మాయమైపోయింది. దానికి ప్రధాన కారణం.. ఈమె కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో మద్యం, సిగరెట్లకు బానిసై పోయిందట.దాంతో ఈమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి.తర్వాత ఈమెకు డిప్రెషన్‌కు కూడా గురైనట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఈమెకు కోలుకునేలా చేసి తరువాత ప్రోబల్ బసు అనే వ్యక్తితో పెళ్లి చేశారు.

తర్వాత ఈమెకు బాబు పుట్టడంతో పూర్తిగా కోలుకున్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. మంచి పాత్ర దొరికితే టాలీవుడ్ కు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తానని చెబుతుంది ఈ అమ్మడు.మరి ఈమెకు తగ్గ పాత్రని సెట్ చేసి మళ్ళీ టాలీవుడ్ కు తీసుకొచ్చే దర్శకుడు ఎవరో.. వేచి చూడాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus