Radhika: పెళ్లి విషయంలో అమ్మాయిలు చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు… రాధిక కామెంట్స్ వైరల్!

ఒకానొక సమయంలో అమ్మాయిలు వారి పెళ్లి విషయంలో ఎంతో పద్ధతిగా పెద్ద వాళ్ళు చెప్పినట్టు వినేవారు. అయితే అమ్మాయిలు ఎప్పుడైతే స్వతంత్రంగా వాళ్ళు కాళ్లపై వాళ్లు నిలబడ్డారో వారి జీవితం గురించి వాళ్లు నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లి పిల్లల విషయంలో వారి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని సీనియర్ నటి రాధిక కామెంట్ చేశారు. ఒక కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాధికను ప్రశ్నిస్తూ పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ… ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి అమ్మాయిల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.వీరి విషయంలో పెళ్లి అనేది పెద్ద సమస్య అయిందని రాధిక తెలిపారు. అమ్మాయిలు ఎప్పుడైతే మంచిగా చదువుకొని ఫైనాన్షియల్ సపోర్ట్ గా నిలబడ్డారో ఆ క్షణమే ఆడ మగ అనే తేడాలు లేకుండా పోయాయని తెలిపారు. రీసెంట్ గా ఇలాంటి విషయం గురించి తాను యంగ్ హీరోయిన్స్ తో మాట్లాడినప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం ఎందుకు సరోగసి ఉంది

కదా అంటూ సమాధానం చెప్పారనీ రాధిక తెలిపారు. పిల్లల్ని కనడానికి ఐవీఎఫ్ వంటి మార్గాలు ఉండగా మగాళ్ళ అవసరం ఏంటి అంటూ సమాధానం చెప్పడంతో తను చాలా షాక్ అయ్యానని రాధిక ఈ సందర్భంగా తెలిపారు. ఇలా పెళ్లి విషయంలో అమ్మాయిలు పూర్తిగా వారి ఆలోచనలు మార్చుకున్నారని ఈ సందర్భంగా రాధిక పెళ్లి పిల్లల గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus