Rambha: మీ అందరికీ రుణపడి ఉన్నా.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నటి?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈమె వివాహం తర్వాత సినిమాలకు దూరమై కెనడాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు పిల్లలకు తల్లి అయినటువంటి రంభ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే మంగళవారం నటి రంభ కారుకు ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే.

సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకువస్తుండగా ఈమె కారుకు మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సోషల్ మీడియా వేదికగా తన కారుకు జరిగిన ప్రమాదం గురించి అలాగే ఈ ప్రమాదంలో తన కుమార్తె సాషాకు స్వల్ప గాయాలైనట్టు తెలియజేశారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా తన కూతురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి ఫోటోతో పాటు కారు ప్రమాదానికి గురైనటువంటి ఫోటోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కూతురు క్షేమంగా కోలుకోవాలని ప్రార్థించండి

అంటూ ఈమె అభిమానులను కోరారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త కంగారు పడ్డారు.ఇలా ఈమె కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కారు ప్రమాదం తర్వాత ఈమె మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు.కారు ప్రమాదం తర్వాత ఈమె అభిమానులతో మాట్లాడుతూ తమ కోసం తమ కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్క అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేశారు.

మా పట్ల ఎంతో ప్రేమను చూపించిన మీ అందరికీ రుణపడి ఉన్నా, ప్రస్తుతం తన కూతురు ఆరోగ్యంగా ఉందని తన ఇంటికి కూడా వచ్చింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus