Roja,Ramya Krishna: రోజా ఇంటికెళ్లిన రమ్యకృష్ణ.. చీర పెట్టి మరీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

రోజా – రమ్యకృష్ణ.. ఇద్దరూ కూడా నిన్నటితరం స్టార్ హీరోయిన్లు. గతంలో వీళ్ళు ‘ముగ్గురు మొనగాళ్లు’ ‘సమ్మక్క సారక్క’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. రోజా అయితే బుల్లితెర పై పలు షోలలో పాల్గొని తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చింది. అలాగే మంత్రి పదవిలో కొనసాగుతూ వస్తోంది. ఇక రమ్యకృష్ణ అయితే ‘బాహుబలి’ తో ఇండియా మొత్తం పాపులర్ అయ్యింది. అయితే రోజా – రమ్యకృష్ణ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.

రమ్యకృష్ణ తమిళనాడుకు చెందిన వారు అయినప్పటికీ తెలుగు వాడైనా కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. రోజా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ.. తమిళ దర్శకుడైన సెల్వమణి ని పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉండగా.. 23 ఏళ్ళ తర్వాత రమ్యకృష్ణ – రోజా కలిశారని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ మధ్యలో వీళ్ళు చాలా సార్లు కలిసి కనిపించినట్టు కొందరు కామెంట్లు పెడుతున్నారు. అది పక్కన పెట్టేస్తే..

తన ఇంటికి వచ్చిన (Ramya Krishna) రమ్యకృష్ణకి బొట్టు పెట్టి, చీర ఇచ్చి సాగనంపింది రోజా. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. “మంచి స్నేహితులు నక్షత్రాల లాంటి వాళ్ళు.అలాంటి వాళ్ళని రోజూ చూడలేరు. కానీ, మీ కోసం వాళ్ళు ఎప్పుడూ నిలబడతారు.అది మీకు తెలుస్తుంది. ఈరోజు మా ఇంటికి వచ్చి, నాకెంతో సంతోషాన్ని అందించిన నా నక్షత్రానికి హృదయపూర్వక స్వాగతం. మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఆ రోజుల్లో ‘మా జీవితం ఎలా ఉండేదో, ఒకప్పటి మా నవ్వులు ఎలా ఉండేవి’ అనేవి కాస్త గుర్తొచ్చాయి.

మేమిద్దరం కలుసుకుని ఎన్నాళ్లు అయ్యిందనేది ముఖ్యం కాదు. నా స్నేహితురాలు రమ్యకృష్ణను కలిసినప్పుడు మళ్ళీ నా మొహం పై కనిపించే చిరునవ్వు, నాకు కలిగే ఆనందమే నాకు ముఖ్యం. ఆమె ఎప్పుడూ ఓ అద్భుతమే’ అంటూ రాసుకొచ్చింది రోజా. అలాగే ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియో కూడా వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus