Rashmika: రష్మిక మందనకు రెండు విధాలుగా దెబ్బ పడింది..!

టాలీవుడ్లో రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు కొట్టిన్నర వరకూ పారితోషికం తీసుకునే రేంజ్ కు ఈమె వెళ్ళింది. దాంతో ఈమె కన్నడలో నటించిన సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పటికే ‘పొగరు’ రిలీజ్ అయ్యింది. ప్లాప్ టాక్ వచ్చినా ఇక్కడ రష్మిక ఇమేజ్ వల్ల మంచి ఓపెనింగ్సే వచ్చాయి. అయితే తరువాత సర్దేసింది లెండి. ఇక ఈ మధ్యనే రష్మిక నుండీ వచ్చిన మరో డబ్బింగ్ చిత్రం ‘సుల్తాన్’. అయితే ఇది తమిళ డబ్బింగ్ మూవీ లెండి.

దీని విషయంలో కూడా సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయ్యింది. ఓపెనింగ్స్ అయితే బానే వచ్చాయి. కానీ తరువాత డౌన్ అయిపోయింది. అయినా తెలుగులో ఈమె ఇమేజ్ కు డ్యామేజ్ ఏమీ అవ్వలేదు. కానీ కోలీవుడ్లో మాత్రం ఈమె డెబ్యూ మూవీనే డిజాస్టర్ కావడంతో ఈమె డిజప్పాయింట్ అయ్యింది. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని.. ఇంకా బోలెడు ఆఫర్లను తెచ్చిపెడుతుందని ఈమె భావించింది. కానీ ఈమె ఆశల పై నీళ్లు జల్లినట్టు అయ్యింది. అంతేకాకుండా విజయ్ సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చింది.

కానీ ఎందుకో చివరి నిమిషంలో పూజా హెగ్డే ను ఫైనల్ చేశారు ఆ చిత్రం దర్శక నిర్మాతలు.సర్లే ‘సుల్తాన్’ హిట్ అయితే ఇంకా బోలెడు అవకాశాలు వస్తాయి అని ఈమె లైట్ తీసుకుంటే. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. దాంతో రష్మిక కు రెండు విధాలుగా కూడా పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ సినిమా చేస్తుంది. మరి అక్కడ ఈమె డెబ్యూ ఎలా ఉండబోతుందో..!

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus