Rashmika: మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక.. ఏకంగా అన్ని లక్షలు నొక్కేసారా?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి హీరోయిన్ రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈమె ఇతర భాష సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఆర్థిక వ్యవహారాలను వారికి సినిమా అవకాశాలను తీసుకురావడం అంతా కూడా మేనేజర్ల పైన ఆధారపడి ఉంటుంది. వారికి ఎంత పెద్ద మొత్తంలో అవకాశాలను కనుక తీసుకొస్తే మేనేజర్లకు అంత లాభం ఉంటుంది కనుక మేనేజర్లు పెద్ద ఎత్తున హీరో హీరోయిన్ల కోసం కష్టపడుతూ ఉంటారు.

ఇక సెలబ్రెటీల ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మేనేజర్లే చూసుకుంటారు. ఈ తరుణంలోనే కొంతమంది మేనేజర్లు తమ చేతివాటం చూపిస్తూ పెద్ద ఎత్తున సదరు సెలబ్రిటీలను మోసం చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు మోసపోయిన సందర్భాలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ తన మేనేజర్ మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయని దాంతో ఆయన తనని తొలగించారు అంటూ కూడా వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా నటి (Rashmika) రష్మిక మందన్న సైతం తన మేనేజర్ చేతిలో భారీగా మోసపోయారని తెలుస్తోంది.తన వద్ద గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి తన మేనేజర్ తనకు తెలియకుండా పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేశారట. ఈ విధంగా రష్మిక మందన్న నాకు తెలియకుండా సుమారు 80 లక్షల వరకు ఫ్రాడ్ చేయటంతో ఆ విషయం తెలిసిన రష్మిక మందన్న తనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనని మేనేజర్ గా తొలగించారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో రష్మిక బిజీగా ఉన్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus