Rashmika: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ రీల్ జోడీ రియల్ జోడీ అయితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా రష్మిక పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని పెంచుకున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో వరుస విజయాలతో ఈ బ్యూటీ సత్తా చాటుతున్నారు. మహేష్, అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన రష్మిక భవిష్యత్తులో మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్, చరణ్ లకు రష్మిక జోడీగా నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఒక ఈవెంట్ కు టైగర్ ష్రాఫ్ తో కలిసి హాజరైన ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు.

ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. పుష్ప2, యానిమల్, రెయిన్ బో సినిమాలతో రష్మిక బిజీగా ఉండగా రాబోయే రోజుల్లో రష్మికకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కెరీర్ పరంగా రష్మిక (Rashmika) మరింత ఎదిగి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కెరీర్ విషయంలో రష్మిక ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఆమె టాలెంట్ కు తగిన మరిన్ని ఆఫర్లు రావాలని అభిమానులు భావిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus