క్యాస్టింగ్ కౌచ్.. ఈ పదం అందరికీ కామన్ అయిపోయింది. అనుభవించిన వారికి, వేధించిన వాళ్లకి, వింటున్న వాళ్లకి కూడా చాలా రెగ్యులర్ టాపిక్. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. దీనికి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కాకపోతే దీని గురించి ఓపెన్ గా చెప్పేవాళ్ళు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నవాళ్లే కావడంతో జనాలు ఈ ఇష్యూని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ రతన్ రాజ్ పుత్ గతంలో ఆమె ఎదుర్కొన్నటువంటి ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
ఆమె (Actress) మాట్లాడుతూ.. ‘ఓసారి ఆడిషన్ కోసం ముంబైలోని ఓషివారా సబర్బ్ హోటల్ కి వెళ్లాను. ఆడిషన్ పూర్తయ్యాక కో-ఆర్డినేటర్ వచ్చి డైరెక్టర్ కి మీ వర్క్ నచ్చింది. మీటింగ్ కి రెడీ అవ్వండి. దీంతో ఆ మీటింగ్ కోసమని టాప్ ఫ్లోర్ కి వెళ్లాను. కానీ అక్కడ నన్ను బలవంతం పెట్టి ఓ కూల్ డ్రింక్ ఇచ్చారు. అది చాలా తేడాగా ఉంది. ఆ తర్వాత మేము ‘కాసేపయ్యాక ఫోన్ చేస్తాం మీరు వెళ్ళండి’ అన్నారు.
తర్వాత ఫోన్ చేసి ఓ చోటుకి రమ్మన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ప్లేస్ అంతా చాలా చండాలంగా ఉంది.నాకు అక్కడ ఓ అమ్మాయి స్పృహ లేకుండా నేలపై పడున్నట్టు కనిపించింది. ఇంతలో మరో వ్యక్తి వచ్చి నన్ను బాగా తిట్టారు. ఆ వాతావరణం చాలా చిత్ర విచిత్రంగా ఉంది. దీంతో శతవిధాలా ప్రయత్నించి అక్కడ నుండి బయటపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది.