జయభేరి అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రవళి.. ఆ తర్వాత ‘అలీ బాబా అరడజను దొంగలు’ సినిమాలో కూడా నటించింది. ‘వినోదం’ ‘పెళ్ళి సందడి’ ‘శుభాకాంక్షలు’ చిత్రాలు ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసాయి. అయితే ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ‘స్టాలిన్’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా అవి ఈమెకు కలిసి రాలేదు. దీంతో ఈమె సినీ పరిశ్రమకు దూరమైంది.
తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేకపోయింది. దాదాపు 12 ఏళ్ళ నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉంది రవళి. ఆమె చివరిగా వేణు హీరోగా నటించిన ‘మాయగాడు’ సినిమాలో నటించింది. ఇక రవళి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2007లో హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వ్యాపారి అయిన నీలకృష్ణను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
ఈ దంపతులు 2008లో ఓ ఆడపిల్లకు తల్లిదండ్రులు అయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా రవళి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లి అక్కడ మీడియా కంటపడ్డారు.ఆమె లుక్ చూసిన వారంతా షాక్ అయ్యారు అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె బాగా బరువు పెరిగారు. అలాగే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ‘ఏంటి ఈమె రవళినా?’ అంటూ షాక్ అయ్యే రేంజ్లో ఆమె ఉంది. ఆమె లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.