సీనియర్ హీరోయిన్ రోజా డాటర్ అన్షుమాలిక ఫోటోలు వైరల్..!

  • September 14, 2020 / 02:20 PM IST

సీనియర్ హీరోయిన్ రోజా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తన వయసుకు తగినట్టు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తుంది. అంతేకాకుండా ‘జబర్దస్త్’ షోలో జడ్జిగా వ్యవహరించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను డబుల్ చేసుకుంది. ప్రస్తుతం ఈమె రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వై.సి.పి పార్టీలో ఎం.ఎల్.ఎ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడమనేది చాలా అరుదు.

తన భర్త మరియు తమిళ సీనియర్ డైరెక్టర్ అయిన సెల్వమణి గురించి అయితే అందరికీ సుపరిచితమే. ఇదిలా ఉండగా.. తాజాగా రోజా పిల్లల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రోజా ముద్దుల కూతురు అయిన అన్షుమాలిక ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అన్షుమాలిక తన 17వ పుట్టినరోజును తన కుటుంబసభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. చూడడానికి ఎంతో అందంగా, ఆకర్షించే విధంగా కనిపిస్తుంది అన్షు.

సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్.! అయితే ఈమె కూడా హీరోయిన్ అవుతుందా? అంటే మాత్రం.. ప్రస్తుతానికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. చదువు పూర్తయ్యే వరకూ అలాంటి వాటికి అన్షుమాలికను దూరంగా ఉంచాలని రోజా సెల్వమణి భావిస్తున్నట్టు సమాచారం. అయితే కొడుకు లోహిత్ ను మాత్రం హీరోని చెయ్యాలని ఉందని రోజా పలు సందర్భంలో చెప్పుకొచ్చింది రోజా. ఏదైతేనేం అన్షుమాలిక లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

 

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus