Roja Home Tour: రోజా మనసుపెట్టి నిర్మించుకున్న ఇల్లు చూశారా!

సినిమా తారలు, టీవీ నటలు ఈ మధ్య ఎక్కువగా చేస్తున్న పని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేయడం, ఆ తర్వాత అందులో వాళ్ల ఇంటి హోం టూర్‌ చేయడం. అలా పెద్ద పెద్ద నటుల ఇళ్లే మనం ఇప్పటివరకు చూశాం. కానీ తొలిసారి టీవీ ఛానల్‌లో హోం టూర్‌ చేసి చూపించారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’లో ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా ఇల్లు హోం టూర్‌ చేసి చూపించారు. ఇటీవల ప్రసారమైన ఆ ఎపిసోడ్‌ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

Click Here To Watch

సినీ తారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం అంటే ఎవరికైనా ఆసక్తే. వాళ్ల ఇల్లు ఎలా ఉంటుంది, ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి, ఆ ఇంటి సంగతులు ఏంటి, వారింట్లో ఎలాంటి ఫర్నిచర్‌ ఉంటుంది అని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటుంటారు ప్రేక్షకులు. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకే పరిమితమైన హోం టూర్‌… టీవీలోకి కూడా వచ్చేసింది. అలా నగరిలో ఉన్న రోజా ఇల్లు చూపించారు. టీవీలో టెలీకాస్ట్‌ అయిన తొలి హోం టూర్‌ ఇదే అని చెప్పొచ్చు.

గతంలో ఎప్పుడో చిరంజీవి జీవితంలో ఒక రోజు అంటూ ఇలాంటి ప్రయోగమే ఒకటి ఈటీవీ చేసింది. రోజా హోం టూర్‌… హోం టూర్‌లా కాకుండా ఓ స్కిట్‌లా రూపొందించారు. హైపర్‌ ఆది తన బృంద సభ్యులు శాంతి స్వరూప్‌, ఐశ్వర్య, అజార్‌, పరదేశితో కలసి నగరిలోని రోజా ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎప్పటిలానే తన పంచ్‌లతో కితకితలు పెట్టాడు. తమ ఇంటి గురించి చెప్తూనే రోజా ఆదిపై సెటైర్లు వేశారు.

ఈ క్రమంలో మహేశ్‌ బాబుతో కలసి నటించాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు. రోజా ఇంటి ఫర్నీచర్‌, భోజన గది, పూజ గది, వంట గది, ఫొటో గ్యాలరీలు, తన కూతురు అన్షు మాలిక రాసిన పుస్తకాన్ని కూడా పరిచయం చేశారు. రోజా ఎంతో ప్రేమతో నిర్మించుకున్న ఇల్లు చూస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే. గురువారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేయండి మరి.

1

2

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!


ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus