పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో వీక్ డేస్ లో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే భీమ్లా నాయక్ విషయంలో జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించిందని చాలామంది భావిస్తున్నారు.
పవన్ సోదరుడు నాగబాబు సైతం జగన్ సర్కార్ పై తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా పవన్ కళ్యాణ్ పై, భీమ్లా నాయక్ సినిమాపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. జగన్ సర్కార్ పై భీమ్లా నాయక్ సినిమా వల్ల విమర్శలు చేసిన వాళ్లకు రోజా ధీటుగా బదులిచ్చారు. భీమ్లా నాయక్ సినిమా టికెట్లను 150 రూపాయలకు విక్రయించారని ఈ విధంగా విక్రయించడం వల్ల భీమ్లా నాయక్ మూవీకి వచ్చిన నష్టం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ నష్టపోతున్నాడని కామెంట్లు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కానప్పుడు ఏ విధంగా నష్టపోతాడని రోజా కామెంట్లు చేశారు. పుష్ప, అఖండ సినిమాల విషయంలో ఏ నిబంధనలు అమలయ్యాయో భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా అవే నిబంధనలను అమలు చేశామని రోజా చెప్పుకొచ్చారు. ఈ నెల 21వ తేదీన టికెట్ ధరలు, ఇతర సమస్యల గురించి కీలక నిర్ణయం రావాల్సి ఉందని రోజా తెలిపారు.
అయితే వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి వల్ల ఆ నిర్ణయం అమలు వాయిదా పడిందని రోజా కామెంట్లు చేశారు. సినిమా సమస్యలకు సంబంధించి త్వరలో సొల్యూషన్ దొరుకుతుందని ఆమె కామెంట్లు చేశారు. రోజా చేసిన కామెంట్లకు పవన్ అభిమానుల నుంచి, పవన్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!