కశ్మీర్, పహల్గామ్ ఉగ్రదాడి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఇండియన్స్ రగిలిపోతున్నారు. శాంతి, భద్రతల గురించి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుని.. నెమ్మదిగా ఉన్న టైంలో ఇలా జరగడంపై అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు అన్నీ భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి. మరోపక్క పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌పై కఠిన ఆంక్షలు విధిస్తున్న సంగతి కూడా తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇండియా నుండి అందాల్సిన వనరులు నిలిపివేయడం జరిగింది.
ఈ క్రమంలో పాక్ లో ఉన్న పేద ప్రజలంతా నలిగిపోతున్నారు. లీటర్ పాలు రూ.250 పెట్టి కొనుగోలు చేయలేక విలవిలలాడిపోతున్నారు. సో ఇండియా త్వరలోనే పాక్ టెర్రరిస్టులకు సరైన కౌంటర్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ నుండి ఇతర దేశాల్లో పనులు చేసుకుని బ్రతుకుతున్న వారు కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి అవమానాలు మా పాకిస్తాన్ వాళ్ళకి సర్వసాధారణమే అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఆమె మరెవరో కాదు సభా కమర్ (Saba Qamar ). ‘ఎక్కడికి వెళ్లినా మేము పాకిస్తాన్ కు చెందిన వాళ్లమని తెలిస్తే.. మమ్మల్ని వేరుగా చూస్తారు. ఒకసారి జార్జియాలోని టిబిలీసి వెళ్లినప్పుడు ఎయిర్పోర్ట్ లో నా పాస్ పోర్ట్ చూసి పక్కన నిలబెట్టారు. అందరినీ పంపేసిన తర్వాత గంట పైనే నన్ను విచారించి అన్ని వివరాలు తీసుకుని అప్పుడు అనుమతి ఇచ్చారు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది’ అంటూ సభా కమర్ (Saba Qamar ) ఆవేదన వ్యక్తం చేశారు.