Sadaa: ‘టార్చ్ లైట్’ సినిమాలో నటించడానికి కారణం అదే..!

  • August 19, 2022 / 04:02 PM IST

‘సదా’.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ‘జయం’ చిత్రంతో టాలీవుడ్లో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని… ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన ‘నాగ’ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ‘అపరిచితుడు’ చిత్రంతో తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది సదా. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ప్లాప్ అవ్వడంతో ఈమె క్రేజ్ పడిపోయింది.

ఈ మధ్య కాలంలో ఆమె బుల్లితెర పై అలాగే వెబ్ సిరీస్ లలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడానికి ముందుకు సదా ఓ బోల్డ్ సినిమాలో నటించింది. అందులో ఆమె వేశ్య పాత్ర పోషించింది. సాధారణంగా ఇలాంటి పాత్రలు చేయడానికి కొంచెం ఫేమ్ ఉన్న హీరోయిన్లు కూడా ఒప్పుకోరు.కానీ సదా ఎందుకు ఇలాంటి పాత్ర చేసింది అనే డౌట్ అందరిలోనూ ఏర్పడింది. తాజాగా ఈ విషయంపై సదా స్పందించి క్లారిటీ ఇచ్చింది.”

‘టార్చ్ లైట్’ (శ్రీమతి 21F)’ అనే సినిమాలో వేశ్య పాత్ర చేశాను. ఆ టైంలో ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నాను. నిజానికి నటి అన్నప్పుడు ఎలాంటి పాత్రైనా చెయ్యాలి. నా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న ఇమేజ్ ఆ టైంలో లేదు. కాబట్టి ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా చేయగలను అని ఆ టైంలో నాకు అనిపించింది.మొదటి ఇబ్బంది పడినా ఆ పాత్రలో నిజాయితీ కూడా ఉంది కాబట్టి.. చేయగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది సదా. ఈమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus