Sai Pallavi: ఎంబీబీఎస్ పట్టా పొందిన సాయిపల్లవి.. ఆనందానికి అవధులు లేవుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి (Sai Pallavi) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలలో నటించకపోయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం సాయిపల్లవికే సాధ్యమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం తండేల్ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణం ప్రాజెక్ట్ తో సాయిపల్లవి బిజీగా ఉన్నారు. అయితే హీరోయిన్ సాయిపల్లవి ఇప్పుడు డాక్టర్ సాయిపల్లవి కావడం గమనార్హం. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఎంబీబీఎస్ పట్టా పొందగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సాయిపల్లవి హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే డాక్టర్ పట్టా పొందడం సాధారణమైన విషయం కాదని ఆమె కృషి, ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సాయిపల్లవి యాక్టింగ్ కు గుడ్ బై చెబుతారేమో అని టెన్షన్ పడుతున్నారు. సాయిపల్లవి మాత్రం సినిమా ఆఫర్లు పూర్తిస్థాయిలో తగ్గిన తర్వాతే డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉందని ఆమె గత ఇంటర్వ్యూల ద్వారా వెల్లడైంది.

సాయిపల్లవి బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సాయిపల్లవి కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. సాయిపల్లవి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది నటీమణులు చెబుతుంటారు.

అయితే సాయిపల్లవి మాత్రం యాక్టర్ అయ్యాక డాక్టర్ కావడం కొసమెరుపు. సాయిపల్లవి క్రేజ్ పెరుగుతున్నా పారితోషికం విషయంలో పరిమితంగానే తీసుకుంటున్నారు. సాయిపల్లవి కెరీర్ తొలినాళ్లలో యాడ్స్ లో నటించగా ఇప్పుడు మాత్రం యాడ్స్ కు దూరంగా ఉన్నారు. సాయిపల్లవి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus