Samantha: 30 కోట్లతో ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిన సమంత?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమంత వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతుంది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టారు. ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు పొందిన

ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అలాగే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ఈమె మరింత క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పాలి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సమంతకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ఇటు సౌత్ సినిమాలతో పాటు ఈమె త్వరలోనే బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదులో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేస్తున్న ఈమె ముంబైలో కూడా బీచ్ వ్యూ ఉండేలా ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేశారని

ఈ ఇంటి కోసం సమాంత దాదాపు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. అధునాతన సదుపాయాలతో ఇంద్ర భవనంలో ఉన్నటువంటి ఇంటి కోసం సమంత 30 కోట్లు ఖర్చు చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియాల్సి ఉంది. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఖుషి, యశోద, శాకుంతలం వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus