రంగస్థలంతో కొత్త రికార్డు సృష్టించిన సమంత

ఒక సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిందంటే అది ఆ టీమ్ మొత్తానికి ఆనందాన్ని పంచే విషయం అవుతుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ కి తాము సాధించిన రికార్డ్స్ లో అది ఒకటిగా చెప్పుకుంటారు. అలా ప్రతి హీరో, హీరోయిన్ తాము చేసిన మూవీ వందకోట్లు సాధించాలని కోరుకుంటుంటారు. అయితే అటువంటి అవకాశం అతి తక్కువమందికే వస్తాయి. భారీ ప్రాజక్ట్స్ లో నటించే ఛాన్స్ కొన్ని సార్లు మాత్రమే తలుపుతడుతాయి. సమంతకి మాత్రం ఎనిమిది సార్లు అద్భుతావకాశం వరించింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు వందకోట్లు కొల్లగొట్టాయి. సమంత తమిళంలో నటించిన ’24’, ‘కత్తి’, ‘తెరి’, ‘మెర్సల్’ చిత్రాలు వందకోట్లు సాధించి రికార్డు సృష్టించాయి. ఇక తెలుగులో ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, జనతా గ్యారేజ్’ సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరి..

సమంత క్రేజ్ ని అమాంతం పెంచాయి. ఒక హీరోయిన్ చేసిన ఏడు సినిమాలు వందకోట్ల మార్క్ దాటాయంటే మామూలు విషయం కాదు. తెలుగు, తమిళంలో ఈ రికార్డు సమంత పేరిట ఉంది. రీసెంట్ గా రంగస్థలం సినిమాతో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇలా సమంత కెరియర్లో 100 కోట్లను కొల్లగొట్టిన 8వ సినిమాగా నిలిచింది. సమంత పేరిట ఉన్న ఈ రికార్డును రీచ్ కావాలంటే నేటి హీరోయిన్స్ కి కష్టమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus