Samantha: శాకుంతలం ఫెయిల్యూర్ ను అంగీకరించిన సమంత.. పోస్ట్ కు అర్థం అదేనా?

దాదాపు ఇండస్ట్రీలో 12 సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత తన కెరియర్లో ఎప్పుడు ఎదుర్కోనటువంటి డిజాస్టర్ సినిమాని శాకుంతలం సినిమా ద్వారా ఎదుర్కొందని తెలుస్తుంది. ఎన్నో అంచనాల నడుమ సమంత నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి. మొదటిరోజు మొదటి షో తోనే భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమాకు పూర్తిగా కలెక్షన్లు పడిపోయాయి.

కనీసం ప్రమోషన్ కార్యక్రమాలకు ఖర్చు చేసిన స్థాయిలో కూడా కలెక్షన్లను రాబట్ట లేక పోయింది. ఇలా సమంత కెరియర్లో ఏ సినిమా కూడా ఇలాంటి డిజాస్టర్ ఎదుర్కోలేదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది కనుక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పూర్తి బాధ్యత సమంత వహించాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాని దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు .

కేవలం సమంత (Samantha) పై నమ్మకంతోనే ఈ స్థాయిలో నిర్మాతలు ఖర్చు చేశారనే చెప్పాలి. ఇలా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్ర నిరాశపరిచింది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించారు. ఇక కొన్ని సందర్భాలలో సమంత సింపతి కొట్టేయాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇలా సింపతి కూడా వర్కౌట్ కాలేదని చెప్పాలి.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఫలితాన్ని పరోక్షంగా తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
భగవద్గీత నుండి …
‘కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన
మా కర్మ ఫల హే తుర్ భూః
మా తే సంగోత్స్వ కర్మణి..’ శ్లోకాన్ని ఇంస్టాగ్రామ్ షేర్ చేసింది. ఇక ఈ శ్లోకానికి అర్థం మనకు తెలిసిందే. ప్రయత్నం చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది ఫలితం ఏంటనేది మనం నిర్ణయించలేము. ఫలితానికి భయపడి ప్రయత్నం చేయడం మానరాదు అనే అర్థం వస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా ఫలితాన్ని సమంత అంగీకరించారని తెలుస్తోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus