Samantha, Naga Chaitanya: చైతు గురించి అడిగితే సమంత రియాక్షన్ ఇదే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఈరోజు ఉదయం వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో సమంత వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు సమంతను స్వామి వారి వస్త్రంతో సత్కరించారు. ఆ తరువాత అర్చకులు సమంతను ఆశీర్వదించడంతో పాటు సమంతకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత మీడియా ప్రతినిధులు సమంతను ఒక ఫోటో తీసుకుంటామని కోరారు. తిరుమలకు వచ్చే సెలబ్రిటీలు కెమెరాలకు స్టిల్స్ ఇవ్వడంతో పాటు బైట్స్ ఇవ్వడం, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది.

అయితే మీడియా ప్రతినిధులు ఫోటో అడగగా సమంత మాత్రం “గుడికి వచ్చి.. బుద్ధుందా” అంటూ ఘాటుగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ మధ్య కాలంలో నాగచైతన్య సమంత మధ్య బంధం గురించి అనేక వార్తలు వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంతతో పాటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ సైతం ఈ వార్తలపై స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. తాజాగా సమంత చేసిన కామెంట్లు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి.

మీడియాతో మాట్లాడితే చైతన్య గురించి ప్రశ్నలు ఎదురవుతాయని భావించి సమంత ఘాటుగా జవాబిచ్చారని వినిపిస్తోంది. తిరుమలకు దర్శనానికి సమంత ఒంటరిగా రావడం గురించి నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. సమంత ఇటీవల శాకుంతలం సినిమాను పూర్తి చేయగా తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తమిళంలో సమంత కాతు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus