Samyuktha Hegde: నటి సంయుక్త హెగ్డేకి తీవ్ర గాయాలు.. వైరల్ అవుతున్న వీడియో!

నిఖిల్ హీరోగా తెరకెక్కిన్న ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ సంయుక్త హెగ్డే. తాజాగా ఈమె ఓ సినిమా షూటింగ్లో గాయాలు పాలవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం ఆమె ‘క్రీమ్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో ఈమెకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆమె ఎలా గాయపడింది? అనే విషయాన్ని తెలుపడానికి ఓ వీడియోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఓ ఫైటర్ ను ఎగిరి తన్నుతున్న క్రమంలో ఈమె బ్యాలెన్స్ తప్పి కింద పడింది. కుడి కాలు సరిగ్గా లాండ్ కాకపోవడం వల్ల బలమైన గాయమైనట్లు స్పష్టమవుతుంది.దీంతో కొద్ది రోజులు షూటింగ్ కు దూరంగా ఉండి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సంయుక్త తెలిపింది. సినిమాలో ఈ ఫైట్ చాలా బాగా వచ్చిందట. విడుదలయ్యాక సినిమా చూస్తే సంయుక్తని ప్రేక్షకులు అందరూ మెచ్చుకుంటారని చిత్ర బృందం చెప్పుకొస్తోంది.

‘కిరాక్ పార్టీ’ తో పాటు ఈమె ‘కాలేజ్ కుమార్’ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది. మొన్నామధ్య ‘ఆహా’లో రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా ‘మన్మథ లీలై’లో కూడా నటించింది. ఇప్పటివరకు ఈమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 12కి పైగా సినిమాల్లో నటించింది.

అలాగే బిగ్ బాస్ వంటి టీవీ షోలలో కూడా పాల్గొంది ఈ నటి. ‘కిరిక్ పార్టీ'(కన్నడ) చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. ఇక సంయుక్త షూటింగ్లో గాయపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus