Samyuktha Menon: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సంయుక్త మీనన్!

భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించిన సంగతి తెలిసిందే. పాత్ర పరిధి తక్కువ కావడంతో నిత్యామీనన్ హర్ట్ అయ్యారని ఆ రీజన్ వల్లే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు, సక్సెస్ మీట్ కు, ఇంటర్వూలకు నిత్యామీనన్ హాజరు కాలేదని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. వైరల్ అయిన వార్తలపై నిత్యామీనన్ స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలను నిజమేనని నమ్మారు.

అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ సంయుక్త మీనన్ తో పోలిస్తే నిత్యామీనన్ పాత్ర పరిధి ఎక్కువనే సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ సినిమాలో కొన్ని సీన్లలోనే కనిపించినా సినిమా ప్రమోషన్లకు మాత్రం హాజరయ్యారు. అయితే సంయుక్త మీనన్ కూడా తన పాత్ర నిడివి విషయంలో ఫీలయ్యారని ఎక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొన్నా తన పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కలేదని భావించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వైరల్ అయిన ఈ వార్తల గురించి సోషల్ మీడియా వేదికగా సంయుక్త మీనన్ స్పష్టతనిచ్చారు.

భీమ్లా నాయక్ సినిమా విషయంలో తాను అసంతృప్తికి గురి కావడం వాస్తవమేనని తాను రెండోసారి ఫ్యాన్స్ తో కలిసి భీమ్లా నాయక్ మూవీ చూడాలని భావిస్తే సాధ్యం కాలేదని అందువల్లే తాను అసంతృప్తికి గురయ్యానని ఆమె కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లను ఈ హీరోయిన్ ఖండించారు. భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ తో సంయుక్త మీనన్ కు తెలుగులో ఆఫర్లు పెరుగుతున్నాయి. సంయుక్త మీనన్ భవిష్యత్తులో తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సినిమాసినిమాకు ఈ బ్యూటీ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలలో సంయుక్తకు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. సంయుక్త మీనన్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus