Sanghavi,Vijay: విజయ్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసిన ఒకప్పటి హీరోయిన్ సంఘవి..!

ఒకప్పటి హీరోయిన్ సంఘవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగింది ఈమె. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఈమె అసలు పేరు కావ్య . ఈమె తండ్రి పేరున్న డాక్టర్ కాగా.. తల్లి సాధారణ గృహిణి. అయితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానన్న మాట సంఘవి విషయంలో నిజమైంది. తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ చేయాలని అనుకున్నారు.

కానీ సంఘవి డాన్స్ నేర్చుకోవడం కోసం వెళ్లి దర్శకుడు సెల్వ కంట్లో పడింది. దీంతో ఆమెను ఎలాగైనా హీరోయిన్ ను చేయాలని అతను ఫిక్స్ అయిపోయాడు. దాదాపు 23 సంవత్సరాల పాటు సంఘవి హీరోయిన్ గా రాణించారు. ‘తాజ్ మహల్’ ‘సూర్య వంశం’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి సినిమాల్లో ఈమె నటించి ఆకట్టుకుంది. అలాగే ఈమె తమిళ్ లో హీరో విజయ్ సరసన కూడా నటించింది. ఓ సందర్భంలో ఈమెతో రొమాన్స్ చేయడం వల్ల విజయ్ కు చివాట్లు పడ్డాయట.

ఈ విషయమై సంఘవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను విజయ్‌తో కలిసి ‘రసిగన్‌’ మూవీలో నటించాను. ఆ సినిమాని విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ డైరెక్ట్ చేశారు.షూటింగ్లో భాగంగా చెరువులో ఇద్దరి మధ్యా ఓ రొమాంటిక్‌ సీన్‌ ఉంటుంది. ఆ సమయంలో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇద్దరం అందులో స్నానం చేసి బయటకు రావాలి. నేను సింపుల్‌గా చేశాను. ఆ రొమాంటిక్ సీన్.. చేయడానికి విజయ్‌ ఇబ్బంది పడ్డాడు. నీళ్లు బాగా చలిగా ఉండటంతో వణికిపోతూ ఉన్నాడు.

ఇది చూసిన చంద్రశేఖర్‌గారు ‘ఆ అమ్మాయి చేస్తోంది కదా? నువ్వు చేయడానికి ఏం ఇబ్బంది? అంటూ విజయ్‌పై కేకలు వేశారు. విజయ్‌ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. బయటి వాళ్లతో ఎక్కువగా మాట్లాడరు. ఆయనతో క్లోజ్‌ అయిన వారితోనే మాట్లాడతారు” అంటూ సంఘవి చెప్పుకొచ్చింది. సంఘవి కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus