Chiranjeevi: చిరంజీవి బెడ్‌ రూమ్‌లో సావిత్రి ఫొటో… ఆ రోజు ఏం జరిగిందంటే?

  • April 3, 2024 / 04:20 PM IST

మహానటి సావిత్రిపై (Savitri) సంజయ్‌ కిశోర్‌ ‘సావిత్రి క్లాసిక్స్‌’ అనే బుక్‌ రాసిన విషయం తెలిసిందే. ఈ బుక్‌ లాంచ్‌ వేడుక ఇటీవలజరిగింది. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి అచ్చు వేయించిన ఆ పుస్తకాన్నిచిరంజీవి దంపతులు ఆవిష్కరించారు. ఈ క్రమంలో చిరంజీవి గురించి, సావిత్రి (Chiranjeevi) కుటుంబంతో చిరంజీవి అనుబంధం గురించి విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి. ఈ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదుగానే ఎందుకు ఆవిష్కరించాలనున్నారు అని సురేఖ అడిగిన ప్రశ్నకు విజయ చాముండేశ్వరి ‘‘ఒకసారి నేను చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు..

కాలు నొప్పిగా ఉన్నా మేడ దిగి వచ్చారు. ఉదయాన్నే నిద్ర లేవగానే సావిత్రి ఫొటోను చూస్తానని చిరంజీవి చెప్పారు. నేను నమ్ముతానో లేదోనని బెడ్ రూమ్‌కి వెళ్లి అమ్మ ఫొటో తీసుకొచ్చి మరీ చూపించారు. అమ్మపై అంత అభిమానమున్న చిరంజీవితోనే ఆ బుక్ ఆవిష్కరించాలని అనుకున్నాం అని చెప్పారు. ఈ క్రమంలో తమ కోసం సావిత్రి ఎలా ఉండేవారు, ఏం చేసేవారు అనే విషయాలు కూడా విజయ చాముండేశ్వరి చెప్పారు.

చిన్నప్పటి నుండి పాములంటే నాకు చాలా ఇష్టం. నా ఇష్టాన్ని గమనించిన అమ్మ.. వారాంతాల్లో పాముల వాళ్లను ఇంటికి పిలిపించి ఆడించేది. కొద్ది రోజుల తర్వాత పులి పిల్లల మీద ఇష్టం ఏర్పడింది. దీంతో తమిళనాడు నుంచి రెండు పులి పిల్లల్ని తెప్పించింది. అంటూ ఆ రోజుల్లో జరిగిన విషయాలు చెప్పారు. చిన్నతనంలో అమ్మానాన్నని బాగా మిస్ అయ్యానని, మా పిల్లలు అలా అవ్వకూడదని కుటుంబంతో సమయం గడపాలన్న ఉద్దేశంతో సినిమా ఫీల్డ్‌కి రాలేదు అని ఆమె తెలిపారు.

ముందు తరాల వారికి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ తరానికి ఆమె గురించి తెలిసేలా ‘మహానటి’ (Mahanati) తీశారు. ఇక తర్వాత తరం పిల్లలు గుర్తుపెట్టుకునేలా ఆమె సినిమా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశాం అని విజయ చాముండేశ్వరి చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus