Actress Shakeela: తన ఆరోగ్యం పై వస్తున్న ఫేక్ న్యూస్ లకు ఫుల్ స్టాప్ పెట్టిన నటి షకీలా..!

సెలబ్రిటీలు బ్రతికే ఉన్నప్పటికీ వారు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు పుట్టుకొస్తున్న సందర్భాలను మనం అనేకం చూసాము. ఇలా పుట్టుకొచ్చిన వార్తలను నిజమా? కాదా?..అని ధృవీకరించకుండానే వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. గతంలో వేణు,చంద్రమోహన్ వంటి వారు బ్రతికే ఉన్నా… వారు తుది శ్వాస విడిచినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

ఆమె మరెవరో కాదు షకీలా. గతంలో పలు శృంగార సినిమాల్లోనూ.. అలాగే తెలుగు సినిమాల్లో కూడా ఈమె నటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఈమె నిర్మాతగా కూడా మరి పలు సినిమాలు నిర్మిస్తుంది. ఇదిలా ఉండగా షకీలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, ఆమె ఇక లేరు అంటూ గత కొన్ని గంటలుగా వార్తలు వస్తున్నాయి. ఇవి మరీ ఎక్కువవ్వడంతో షకీలా తన ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. “నేను అనారోగ్యం పాలయ్యాను.. నాకేదో అయిపోయింది అంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు.

 

అదంతా అసత్య ప్రచారమే..నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ప్రాణాలు కోల్పోయినట్టు కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాను కంగారు పడకండి. ఇలాంటి ఫేక్ వార్తల కారణంగా.. నా బంధుమిత్రులు కంగారు పడుతూ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఆ ఫేక్‌ వార్తలు క్రియేట్ చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ వల్లే వారంతా నావైపు ఉన్నారని నాకు సంతోషం కలుగుతుంది” అంటూ పాజిటివ్‌గా స్పందించారు షకీలా.

Most Recommended Video


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus