టీవీ షోలో కూతురిని పరిచయం చేసిన షకీలా!

ఇండస్ట్రీలో షకీలా పేరు తెలియని వారుండరు. ప్రేక్షకుల్లో కూడా ఒకప్పుడు ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. మలయాళంలో నటిగా కెరీర్ మొదలుపెట్టిన షకీలా.. ఎక్కువగా అడల్ట్ చిత్రాల్లోనే కనిపించేది. ‘A’ సర్టిఫికెట్ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోలు తమ సినిమాను రిలీజ్ చేయడానికి వెనక్కి తగ్గేవారు. అంతలా ఇండస్ట్రీని షేక్ చేసింది. అనంతరం కొన్నాళ్లకు అడల్ట్ కంటెంట్ కి గుడ్ బై చెప్పేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి పరిమితమైంది. రీసెంట్ గానే ఈమె జీవితం ఆధారంగా బయోపిక్ ని తెరకెక్కించారు.

ఇదిలా ఉండగా.. షకీలా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ మిల్ల అనే ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకుంది. తాజాగా ఓ తమిళ టీవీ షోలో షకీలా తన కూతురిని పరిచయం చేసింది. కోలీవుడ్ లో బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘కుక్ విత్ కోమలి’ అనే టీవీ షోలో షకీలా కంటెస్టెంట్ గా పాల్గొంది. అందులో పాల్గొన్న తరువాత ఆమె మంచి కుక్ అనే సంగతి అందరికీ అర్ధమైంది. ఈ షో విన్నర్ గా ఆమె గెలవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఈ టీవీ షోకి తన కూతురిని తీసుకొచ్చింది షకీలా.

కొన్నేళ్ల క్రితం మిల్ల అనే ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకున్న షకీలా ఆమె బాగోగులు చూసుకుంటుంది. ఒక్కసారిగా షకీలా తన కూతురిని పరిచయం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మిల్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మిల్ల కూడా నటిగా తన టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంది. షకీలా పెళ్లి చేసుకోకుండా ఇలా ఓ ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకున్నారని తెలుసుకున్న నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus