Shobha Shetty: ఘనంగా శోభా శెట్టి గృహప్రవేశ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Ad not loaded.

శోభా శెట్టి (Shobha Shetty) అందరికీ తెలుసు కదా. ‘కార్తీక దీపం’ సీరియల్లో విలన్ మోనిత గా కనిపించి ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమెను బాగానే ఓన్ చేసుకున్నారు.ఆ తర్వాత ‘బిగ్ బాస్’ సీజన్ 7 లో పాల్గొని తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది. మరోపక్క ‘కార్తీక దీపం’ లో డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య పాత్ర చేసిన నటుడు యశ్వంత్ తో చాలా కాలంగా ప్రేమలో ఉంది శోభా శెట్టి.

ఈ విషయాన్ని ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఓపెన్ గానే అందరికీ తెలియజేసింది. త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇదిలా ఉంటే..  శోభాశెట్టి మరో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది. విషయం ఏంటంటే.. శోభా శెట్టి కొత్తింట్లోకి అడుగుపెట్టిందట. హైదరాబాద్లో సొంతిల్లు అనేది శోభా శెట్టి కల. ఇప్పటివరకు చేసిన సేవింగ్స్ తో ఆ కలను సాకారం చేసుకుంది. శోభా శెట్టి గృహ ప్రవేశ వేడుక కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ‘బిగ్ బాస్ 7 ‘ కంటెస్టెంట్స్ అయినటువంటి సందీప్(Aata Sandeep) , టేస్టీ తేజ (Tasty Teja) , ప్రియాంక జైన్ (Priyanka Jain) , గౌతమ్ వంటి వారు హాజరయ్యారు. అలాగే శోభా శెట్టి బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు శోభా శెట్టికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus