Suriya: కొత్త సినిమా కోసం సీనియర్‌ నాయికతో ఆడిపాడిన సూర్య.. ఎవరంటే?

‘కంగువ’  (Kanguva) సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు సూర్య(Suriya). శివ (Siva)  దర్శత్వంలో ‘కంగువ: ఏ మైటీ వేలియంట్‌ సాగా’గా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాను కూడా ఆయన పట్టాలెక్కించేశాడు. కార్తీక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే స్టార్ట్‌ చేశాడు. తాజాగా ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్నారట. మామూలుగా అయితే ఇది పెద్ద విషయమేమీ కాదు. అయితే ఆ పాటలో శ్రియ శరన్‌ (Shriya Saran) నటించింది అనేది మేటర్‌.

Suriya

సూర్య కొత్త సినిమాలో శ్రియ ఉందనే విషయం నిజమైతే సుమారు ఏడేళ్ల తర్వాత ఆమె కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నట్లు లెక్క. 2017లో వచ్చిన ‘అన్బానవన్ అసరధవన్ అడంగాధవన్’ శ్రియ ఆఖరి తమిళ సినిమా. ఆ తర్వాత ఆమె అటువైపు చూడలేదు. ఇప్పుడు సూర్య – కార్తిక్‌ సుబ్బరాజు సినిమాతో తిరిగి తమిళ పరిశ్రమకు వచ్చింది అని అంటున్నారు. లవ్‌ అండ్‌ వార్‌ అనే కాన్సెప్ట్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే  (Pooja Hegde)కథానాయిక.

శ్రియ నటించిన ప్రత్యేక పాట సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండనుంది అని టీమ్‌ చెబుతోంది. ఊటీలో ఈ పాట షూటింగ్‌ పూర్తి చేశారు అని చెబుతున్నారు. జూన్‌లో ప్రారంభమైన ఈ సినిమా సూర్యకు ప్రమాదం జరగడంతో కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకుంది. ఇప్పుడు ఊటీలో ఓ యాక్షన్‌ సీన్‌, సాంగ్‌ తెరకెక్కించారు అని టాక్‌. తెలుగులో ఆఖరిగా శ్రియ ‘మ్యూజిక్‌ స్కూల్‌’ అనే సాఫ్ట్‌ సినిమాలో కనిపించింది.

ఇప్పుడు తమిళంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది కాబట్టి తెలుగులో కూడా అలాంటి పాటలకు ఓకే చెబుతుంది అని అనుకోవచ్చు. ఇంత వయసు వచ్చినా కుర్ర కథానాయికలకు పోటీనిస్తున్న శ్రియ.. తెలుగులోనూ ప్రత్యేక గీతాల జోలికి వస్తే.. మన కుర్రకారుకు అదో ఆనందం అని చెప్పాలి. మరి చూద్దాం ఎవరు ఆమెను తొలుత స్పెషల్‌ సాంగ్‌ కోసం సంప్రదిస్తారో?

బుల్లితెరపై ప్రేమలు మూవీ రేటింగ్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus