రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని అంటుంటారు. ఆ మాట ఎంతవరకు నిజం అనేది మనం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తుంటాం. అలాగే సినిమాలకు కూడా ఈ లాజిక్ బాగా వర్కవుట్ అవుతుంది అని అంటే నిజమే అని అనాలేమో. ఎందుకంటే సినిమా సినిమాకు స్నేహాలు, బంధాలు మారిపోతుంటాయి. గతంలో పెద్ద పెద్ద హీరోల విషయంలో చూశాం కూడా ఈ పరిస్థితి. ఇప్పుడు చర్చంతా ఎందుకు అంటే సీనియర్ హీరోయిన్ ఒకరు అలానే మాట్లాడారు కాబట్టి.
నాలుగు సీన్స్ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే బెటర్ అంటూ ఇటీవల సీనియర్ నటి సిమ్రన్ (Simran) కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి కూడా. ఇంకా ఆ విషయం తేలలేదు అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఆమె మరికొన్ని విషయాల గురించి రెస్పాండ్ అయ్యారు. దీంతోపాటు గతంలో చేసిన కామెంట్లకు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే క్లారిటీ కంటే కొత్త చర్చలే ఎక్కువవుతున్నాయి అని చెప్పాలి.
నా తోటి నటి చేసిన కామెంట్స్ బాధించాయి. అందుకే ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ అలా రియాక్ట్ అయ్యాను అంటూ ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది అనే మాట చెప్పాను. కెరీర్ ఆరంభం నుండి అడపాదడపా ఆంటీ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నాను. అలా యాక్ట్ చేయడంలో తప్పేముంది. ఆ పాత్రలు నాకు ఇష్టం. అందుకే చేశాను. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో ఈ క్లారిటీ వచ్చింది అని సిమ్రన్ చెప్పారు.
స్నేహితులనుకున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్‌తో మనల్ని బాధిస్తారు. ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు ఫోన్ చేసింది. అయితే నేనేమీ ఇబ్బందిపడలేదు. కానీ ఆమెతో అంతకుముందు ఉన్న అనుబంధం ఇప్పుడు లేదు అని సిమ్రన్ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా వింటుంటే పరిశ్రమలో ఫ్రెండ్స్ అని చెబుతూ తిరుగుతున్న హీరోయిన్లు నిజంగా ఫ్రెండ్స్ కాదా అని. ఏమో ఇంకెవరైనా చెబితే కానీ క్లారిటీ రాదు.