Actress Sneha: స్నేహ – ప్రసన్నలు విడిపోతున్నారా… ?

  • November 11, 2022 / 06:39 PM IST

సుహాసిని రాజారాం నాయుడు ఇలా చెప్తే బహుశా ఎవ్వరికీ అర్ధం కాదేమో అదే హీరోయిన్ స్నేహ అంటే మాత్రం అందరికీ టక్కున స్ట్రైక్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు స్నేహ. తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ అటు తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..

సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ఉండేది స్నేహ. కచ్చితంగా ఈమె టాలీవుడ్లో మరో సౌందర్య అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కొత్త హీరోయిన్ల పోటీకి ఈమె నిలబడలేకపోయింది. కొన్నాళ్ల తర్వాత తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుని ప్రాముఖ్యమైన పాత్రలు కలిగిన సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది.ఈ జంట చాలా యాడ్స్ లో నటించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇదిలా స్నేహ – ప్రసన్న ల గురించి ఓ షాకింగ్ గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది.

విషయంలోకి వెళ్తే.. స్నేహ కొద్దిరోజులుగా తన భర్తకు దూరంగా ఉంటుందట. వీరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో స్నేహ తన భర్త పై చాలా కోపంగా ఉందట. పిల్లలు కూడా ఈమె దగ్గరే ఉంటున్నారట. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. సామరస్యంగా వీరి మధ్య గొడవలు పరిష్కరించడానికి వీరి పెద్దలు ప్రయత్నిస్తున్నారట.

కానీ స్నేహ మాత్రం ఒప్పుకోవడం లేదు అని వినికిడి. భార్యాభర్తల గొడవలు సంభవించడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే స్నేహ దంపతుల వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న?

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus