సుహాసిని రాజారాం నాయుడు ఇలా చెప్తే బహుశా ఎవ్వరికీ అర్ధం కాదేమో అదే హీరోయిన్ స్నేహ అంటే మాత్రం అందరికీ టక్కున స్ట్రైక్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు స్నేహ. తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ అటు తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకునేది స్నేహ. దాంతో ఈమె టాలీవుడ్లో మరో సౌందర్య అవుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ కొత్త హీరోయిన్ల పోటీకి ఈమె నిలబడలేకపోయింది.తరువాత తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుని ప్రాముఖ్యమైన పాత్రలు కలిగిన సినిమాల్లోనే నటిస్తుంది.ప్రస్తుతం యాడ్స్ లో కూడా నటిస్తూ వస్తోంది స్నేహ. ఇదిలా ఉండగా.. 40 ఏళ్ళ వయసొస్తున్నా ఈమె అందం చెదరలేదు అంటే నమ్మండి. ఇటీవల ఈమె చీరకట్టులోనే ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫొటోల్లో ఈమె చాలా చక్కగా కనిపిస్తుంది. నెటిజన్లు కూడా వీటికి ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఈ ఫోటోలను ఓ లుక్కెయ్యండి :