Sreeleela: కుర్ర హీరోయిన్‌ కెరీర్‌ను రిస్క్‌లో పెడుతున్నారా!

సినిమాలో హీరోయిన్‌గా ఓ కుర్ర భామను ఎంపిక చేసుకుంటే… ఆమెతో పాటు వాళ్ల కుటుంబ సభ్యుడు/ సభ్యురాలిని కూడా ఎంపిక చేసుకున్నట్లే అంటుంటారు సినిమా కష్టాలు తెలిసినవాళ్లు. అందులోనూ ఆ హీరోయిన్‌కు తొలి ప్రయత్నంలో బంపర్‌ హిట్ తగిలితే తట్టుకోవడం ఇంకా కష్టం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ‘పెళ్ళి సందD’ భామ శ్రీలీల కూడా ఇలానే ఆలోచిస్తోందా? టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ విషయమ్మీదే చర్చ జరుగుతోంది. ‘పెళ్ళి సందD’ తర్వాత శ్రీలీల ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.

Click Here To Watch NOW

వరుస సినిమా ఛాన్స్‌లు అయితే వచ్చాయి. కానీ ఆమె మాత్రం సెలక్టడ్‌గా సినిమాలు ఎంపిక చేస్తోంది అని తెలిసింది. అయితే అవి సెలక్ట్‌డ్‌ కాదు, ఆమె అమ్మ అడుగుతున్న గొంతెమ్మ కోర్కెలే అని తెలుస్తోంది. సినిమా ఛాన్స్‌ అని డోర్‌ కొడితే… వాళ్లను నానా తిప్పలు పెడుతున్నారని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. ముందుగా చెప్పినట్లు ‘పెళ్లి సందD’ సినిమాతో ఒక్కసారిగా నాలుగు ఐదు సినిమాల్లో అవకాశాలు పొందింది శ్రీలీల.

యువ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మను తీసుకునేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. దాంతో ఆమె రెమ్యూనరేషన్‌, వాళ్ల అమ్మ ఓరియెంటేషన్‌ బాగా మారిపోయాయట. గొంతెమ్మ కోర్కెలు కూడా ఈ క్రమంలో కొన్ని వినిపిస్తున్నాయట. శ్రీలీల పారితోషికం పారితోషికం విషయంలో ఆమె చాలా కరాఖండిగా ఉంటున్నారట. అంతేకాదు అదనపు సౌకర్యాలు లాంటివి కూడా యాడ్‌ చేస్తున్నారట. శ్రీలీల నటించిన రెండో సినిమా (రవితేజ ‘ధమాకా’) ఇంకా విడుదల కానేలేదు. అప్పుడే ఒక్కో నిర్మాతకు ఒక్కో రకంగా పారితోషికం చెబుతున్నారట.

సినిమా హీరో బట్టి, నిర్మాణ సంస్థను బట్టి లెక్క మారిపోతోందని సమాచారం. దీంతో శ్రీలీలని తమ సినిమాల్లో తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అని అంటున్నారు. ఆమెను ఒప్పిండచం పక్కన పెడితే ముందు ఆమె మమ్మీని మెప్పించడం చిత్రబృందాలకు పెద్ద టాస్క్ అయిపోయిందనే మాటలూ వినిపిస్తున్నాయి. అధికారికంగా శ్రీలీల ఇప్పుడు నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, రవితేజ ‘ధమాకా’, గాలి కిరీటి సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా, ప్రభాస్‌ – మారుతి సినిమాలో కూడా ఉంది అని అంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus