Janhvi Kapoor: జాన్వీ కపూర్ పై మండిపడుతున్న శ్రీదేవి ఫాన్స్… తల్లి పరువు తీస్తుందంటూ?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అగ్రతార దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి అకాల మరణం ఇప్పటికీ అభిమానులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వారసురాలిగా తన కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు.

ఈమె (Janhvi Kapoor) ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వరుస బాలీవుడ్ సినిమాలలో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా హిట్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ పై ఈమె ఆశలు పెట్టుకున్నారు దీంతో ఈమె త్వరలోనే ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇకపోతే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాల కోసం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈమె వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే తాజాగా ఈమెకు ఉన్నటువంటి అలవాట్లు తెలిసి అభిమానులు మండిపడుతున్నారు.

ఈమెకు వీకెండ్ వస్తే చాలు తన స్నేహితులతో కలిసి ఎక్కువగా పబ్ లో పార్టీలు చేసుకుంటూ గడుపుతూ ఉంటారట. ఇలా పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున డ్రింక్ చేయడమే కాకుండా స్మోక్ చేస్తూ ఉంటారని తెలుస్తోంది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె వీకెండ్ వస్తే మాత్రం స్థిమితం లేకుండా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారని తెలిసి ఎంతో మంది అభిమానులు శ్రీదేవి లాంటి గొప్ప నటి కడుపున పుట్టి తన పరువు తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus