Actress Sudha: ఆ వ్యాపారం చేయడం వల్ల.. కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సుధ!

సీనియర్ నటి సుధ అందరికీ సుపరిచితమే..! 500 కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. తల్లి, వదిన, అత్త వంటి పాత్రల్లో చాలా సహజంగా నటిస్తుంది ఈమె. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్ గా కూడా ట్రై చేసింది కానీ.. అలా సక్సెస్ కాలేకపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ‘శ్రీ వినాయక విజయం’ మూవీ ద్వారా బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సుధ అటు తర్వాత తమిళంలో 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఈ విషయం బహుశా ఎక్కువమందికి తెలిసుండదు. కొంతకాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. మంచి పాత్రలు రాకపోవడమే అందుకు కారణమని ఈమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీలో జన్మించిన చాలా డబ్బు పోగొట్టుకుందట. సినిమాల ద్వారా చాలా డబ్బు సంపాదించిన ఈమె.. ఢిల్లీలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల.. రూ.100 కోట్లు పైనే పోగొట్టుకుందట. మొదట ఓ హోటల్ పెట్టినప్పుడు లాభాలు వచ్చాయట.

అదే జోష్ తో ఇంకో హోటల్ పెడితే.. వ్యాపారం దివాళా తీసింది అని ఈమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. తన బాల్యంలోనే తల్లిని కోల్పోయిన సుధ.. అటు తర్వాత తన తండ్రి కూడా క్యాన్సర్ భారిన పడి మృతి చెందినట్టు ఈమె తెలిపింది. అంతేకాదు ఈమె జీవితంలో ఇంకా ట్రాజెడీ ఉంది.ఈమె తండ్రికి క్యాన్సర్ అని తెలియగానే బంధువులు కూడా ఒక్కొక్కరుగా దూరంగా వెళ్లిపోయారట. ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయిందని ఈమె తెలిపింది.

‘మాతృదేవోభవ’ సినిమాలో జరిగిన సంఘటనలు అన్నీ తన జీవితంలో కూడా జరిగినట్లు ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సుధ చెన్నైలో ఒంటరి జీవితం గడుపుతుందట. భర్త, కొడుకు అమెరికాలో ఉంటారట. వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల ఈమెను దూరం పెట్టారట. ప్రస్తుతం సుధ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus