గత 50 రోజుల పై నుండీ లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సినీ కార్మికులు, షూటింగ్ ల పై వచ్చే డబ్బు మీదే ఆధారపడ్డ నటీనటులు ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. కనీసం నిత్యావసరాలు కూడా సరిపడా డబ్బులు లేక వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పెద్ద మనసు చేసుకుని పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ వంతు ఆర్ధిక సాయం చేసినా.. సరిపోని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. ఇదిలా తాజాగా ఓ నటి ఈ లాక్ డౌన్ వల్ల అప్పుల పాలయ్యిందట.
ఆమె ఎవరో కాదు.. సోనాల్ వెంగర్లేకర్. హిందీ సీరియల్స్ చూసే వారికి ఈమె సుపరిచితురాలె. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ ఈమె దగ్గర కొంత డబ్బు ఉంటే.. వాటితో అడ్జస్ట్ అవుతూ వచ్చిందట. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఖర్చయిపోయిందని తెలుస్తుంది. దాంతో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్న ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసిందట. కొన్ని సార్లు ఫోన్ రింగ్ అయినప్పటికీ అతను లిఫ్ట్ చేయలేదట.
అయినా ఈమె ఆగకుండా ఫోన్ చేస్తుంటే.. నెంబర్ బ్లాక్ చేసాడని ఈమె చెప్పుకొచ్చింది. ఇలాంటి తరుణంలో ఓ మేకప్ మెన్ ఈమెకు డబ్బు సాయం చేసాడట. అతని భార్య ప్రెగ్నెంట్ అయినప్పటికీ… ఇప్పటికి తీసుకుని డెలివరీ టైంకి తిరిగి ఇవ్వండి చాలు అని చెప్పాడట. ‘డబ్బు బాగా ఉన్న వాడు తప్పించుకుని తిరిగితే… డబ్బులు లేని వాడు సాయం చేసాడు’ అంటూ సోనమ్ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.