Actress Sujitha: కళ్యాణి, సూర్య కిరణ్ ల విడాకుల పై స్పందించిన సుజిత!

‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్ సూర్య కిరణ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. గతంలో ఈయన ‘సత్యం’ ‘బ్రహ్మాస్త్రం’ ‘రాజూ భాయ్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. అంతేకాదు ఈయన హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. అయినప్పటికీ మనస్పర్థలు రావడంతో 2016 లో విడాకులు తీసుకున్నారు. తనకు ఇష్టం లేకపోయినా.. కళ్యాణికి విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని గతంలో ఓసారి సూర్య కిరణ్ చెప్పుకొచ్చాడు.

తాజాగా వీరి విడాకుల మేటర్ పై మరోసారి డిస్కషన్లు మొదలయ్యాయి. అందుకు కారణం సుజిత. ఆమె ఎవరో అందరికీ తెలుసు. ‘పసివాడి ప్రాణం’ సినిమాలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత ‘జై చిరంజీవ’ ‘ఆజాద్’ వంటి సినిమాల్లో చెల్లెలి పాత్రలు పోషించింది. ఈమె సూర్య కిరణ్ కి స్వయానా చెల్లెలు. సూర్య కిరణ్ – కళ్యాణి ల పెళ్లి జరగడానికి కారణం కూడా ఈమెనే. మొదట కళ్యాణి.. సుజితకి మంచి ఫ్రెండ్ అయ్యింది.

సుజిత (Sujitha) వల్లే సూర్య కిరణ్ – కళ్యాణి ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. కానీ వాళ్ళు విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆర్థిక ఇబ్బందులు అని సుజిత చెప్పుకొచ్చింది. సూర్య కిరణ్ నిర్మాతగా కూడా మారి ఒకటి రెండు సినిమాలు తీశారు. అవి ఫెయిల్ ఫెయిల్ అవ్వడంతో అప్పుల పాలయ్యారు. కళ్యాణి పేరు పై ఫైనాన్స్ అయ్యి ఉండటంతో.. ఆమె విడాకులు తీసుకుని సెపరేట్ అయ్యింది అని స్పష్టమవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus