Tabu: ‘నిన్నే పెళ్లాడతా’ కి ఫస్ట్ ఛాయిస్ టబు కాదు… ఆ స్టార్ హీరోయిన్ అట..!

అక్కినేని నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆ సినిమా బుల్లితెర పై ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అప్పుడే ‘గులాబి’ తో హిట్ కొట్టిన కృష్ణవంశీని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు నాగ్. అయితే ‘గులాబి’ ఓ ప్రేమ కథ. కొంచెం వియోలెన్స్ కూడా ఉంటుంది. అలాంటి దర్శకుడితో నాగార్జున ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు అంటే అంతా ఆశ్చర్యపోయారు ఆరోజుల్లో. అయితే ఆ సినిమా విడుదలైనప్పుడు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మరియు ఆ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు పడిన విధానాన్ని చూసి అంతా బిత్తరపోయారు.

ఈ సినిమాలో హీరోయిన్ టబు గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాఘవేంద్ర రావు గారి తర్వాత హీరోయిన్ ను అంత గ్లామర్ గా చూపించగలిగేది కృష్ణవంశీనే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ టబు కాదట. ఈ సినిమాకి హీరోయిన్ గా మొదట స్టార్ హీరోయిన్ మీనా ని అనుకున్నాడట కృష్ణవంశీ. ఈ కథ ఆమెకు చెప్పడం.. ఆమె ఒకే చెప్పడం కూడా జరిగాయి. కానీ ఈ మూవీ కోసం 62 రోజులు కాల్షీట్లు కోరాడట కృష్ణవంశీ.

అప్పట్లో మీనా చాలా బిజీ..! అన్ని రోజులు కాల్ షీట్లు అయితే కష్టమని భావించి ఈ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. దాంతో గురువు రాంగోపాల్ వర్మ సలహాతో ముంబై వెళ్లి అక్కడ వారం రోజులు స్టే చేసి.. చాలా మంది మోడల్స్ ను చూసి టబుని ఫైనల్ చేసాడట. అలా ‘నిన్నే పెళ్లాడట’ టబు చేయడం ఆమె కెరీర్ కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవ్వడం జరిగింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus