Tamanna: ఏ హీరో దగ్గర అలా ఫీల్ అవ్వలేదు… ప్రియుడు విజయ్ వర్మపై తమన్న కామెంట్స్!

నటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు.ఇన్ని రోజులు వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ ఎట్టకేలకు వీరి ప్రేమ విషయాన్ని బహిర్గతం చేస్తూ మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామంటూ చెప్పకోచ్చారు. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి వీరిద్దరూ ప్రస్తుతం తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. తమన్నా విజయ్ వర్మ లస్ట్ స్టోరీ2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఈ నెల 29వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో తమన్నా చాలా బోల్డ్ సన్నివేశాలలో నటించారని చెప్పాలి. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని తమన్న వెల్లడించారు. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడినటువంటి తమన్న విజయ్ వర్మ తరచు జంటగా కనపడుతూ సందడి చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తమన్నా మాట్లాడుతూ నటుడు విజయ్ వర్మ గురించి పలు విషయాలను వెల్లడించారు.తాను ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో నటించాను కానీ ఏ హీరో దగ్గర నేను సేఫ్ గా ఫీల్ అవ్వలేదని కేవలం విజయ్ దగ్గర మాత్రమే సేఫ్ గా ఫీల్ అయ్యానని తమన్నా తెలియజేశారు.

ఇలాంటి సినిమాలలో నటించేటప్పుడు యాక్ట్రెస్ కు తప్పనిసరిగా కంఫర్ట్ చాలా అవసరం. నేను ఏదైనా చెప్పడానికి, చేయడానికి లేదా ఒక డిఫరెంట్ వేలో నేను ఎమోషన్ ని ఎమోట్ చేయడానికి భయపడకుండా ఉండాలంటే సేఫ్ అనే ఫీలింగ్ నాకు కలగాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇలా తనకు విజయ్ వర్మ దగ్గర మాత్రమే ఆ సేఫ్టీ కనిపించిందని ఈ సందర్భంగా ప్రియుడు గురించి (Tamanna) తమన్న చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus