Tamannaah: మొదటిసారి డేటింగ్ రూమర్లపై స్పందించిన తమన్నా.. ఏమన్నారంటే?

సాధారణంగా సినిమా సెలబ్రెటీల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం సర్వసాధారణం. ముఖ్యంగా సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఒక జంట ఎక్కడైనా కాస్త చనువుగా కనిపించిన లేదా రెండు మూడు సినిమాలలో కలిసిన వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు పుట్టిస్తారు. ఇలా ఎంతోమంది నటీనటుల మధ్య ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.

ఇకపోతే తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా కూడా గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా ఇద్దరు కూడా నడిరోడ్డుపై లిప్ లాక్ చేసుకుంటూ హగ్గులు ఇచ్చుకోవడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు షికారులు చేస్తున్నాయి.

ఇలా గత కొంతకాలంగా విజయ్ వర్మ తమన్నా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఇన్ని రోజులు సహనంతో ఉన్నటువంటి తమన్న ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా విజయవర్మతో డేటింగ్ రూమర్ల గురించి తమన్న మాట్లాడుతూ.. ఇవన్నీ నిరాధార కథనాలని ఖండించారు.ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి వార్తలను ఎలా పుట్టిస్తారో నాకసలు అర్థం కాదని ఈమె కొద్దిపాటి అసహనం వ్యక్తం చేశారు.

విజయ్ వర్మతో డేటింగ్ రూమర్లు గురించి విన్న తర్వాత నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారో కూడా అర్థం కాదు. అయితే ఇలాంటి వార్తలు రాసేముందు ప్రతి ఒక్కరికి ఓ జీవితం ఉంటుందని విషయం గుర్తు పెట్టుకోవాలని ఈమె తెలియచేశారు. నా జీవితంలో అభిమానుల నుంచి ఎంతో అమితమైన ప్రేమను పొందానని, తనకు ఇతరులతో ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవంటూ ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.

ఎట్టకేలకు తమన్నా లవ్ ఎఫైర్ డేటింగ్ రూమర్ల గురించి క్లారిటీ ఇవ్వడంతో ఇకపై అయినా ఈ వార్తలకు పులిస్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్, అలాగే రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా తమన్నా నటిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus