Tamannaah: పెళ్లి దిశగా తమన్నా అడుగులు.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా చిన్న వయస్సులోనే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించారు. తమన్నాతో పాటు సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయ్యారు. తమన్నా కూడా పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబితే వినాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా పెళ్లికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.

ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను తమన్నా పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తమన్నా తల్లీదండ్రులకు, తమన్నాకు పెళ్లి కొడుకు బాగా నచ్చాడని బోగట్టా. కోలీవుడ్ మీడియాలో తమన్నా పెళ్లి గురించి జోరుగా ప్రచారం జరుగుతుండగా వైరల్ అవుతున్న వార్తల గురించి తమన్నా ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మిల్కీ బ్యూటీ పెళ్లి చేసుకుంటే మా హృదయాలు బ్రేక్ అవుతాయని తమన్నా ఫ్యాన్స్ చెబుతున్నారు.

స్టార్ హీరోలకు జోడీగా తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. అడపాదడపా మూవీ ఆఫర్లతో తమన్నా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా తమన్నా రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా యంగ్ హీరోలకు జోడీగా నటించడానికి కూడా ఓకే చెబుతున్నారు.

తమన్నా ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. తమన్నా ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను కూడా ఎక్కువ సంఖ్యలో ప్రకటించడం లేదనే సంగతి తెలిసిందే. తమన్నా భవిష్యత్తు ప్రాజెక్ట్ ల ఫలితాలను బట్టి ఆమె కెరీర్ డిసైడ్ కానుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో తమన్నా గురించి గాసిప్స్ కూడా ఎక్కువగా ప్రచారంలోకి రాలేదనే సంగతి తెలిసిందే.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus