కార్తికేయ హీరోగా తెరకెక్కిన రాజా విక్రమార్క సినిమాతో తాన్యా రవిచంద్రన్ టాలీవుడ్ కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన తాన్యా రవిచంద్రన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చెన్నైలో పీజీ చదివే సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చాయని తాన్య అన్నారు.
ఫ్యామిలీ మెంబర్స్ కు ఒక సినిమా చేస్తానని చెప్పి ఒప్పించి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తాన్య కామెంట్లు చేశారు. అయితే వరుసగా మూడు సినిమాలలో ఆఫర్లు రావడంతో తమిళంలో నటిగా కొనసాగుతూ వచ్చానని తాన్య చెప్పుకొచ్చారు. మూడు సినిమాలు చేసిన తర్వాత పీజీ పూర్తి చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని ఆమె వెల్లడించారు. రాజా విక్రమార్క డైరెక్టర్ శ్రీ సరిపల్లి చెన్నైకు వచ్చి తనకు కథ చెప్పారని తాన్య చెప్పుకొచ్చారు.
కథలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యమని పాత్ర కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని తాన్యా రవిచంద్రన్ వెల్లడించారు. కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ అని తాన్య తెలిపారు. సాయికుమార్, తనికెళ్ల భరణితో కలిసి నటించడం సంతోషంగా ఉందని తాన్య కామెంట్లు చేశారు. కార్తికేయ నటన చాలా నేచురల్ గా ఉంటుందని కార్తికేయతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందని తాన్య అన్నారు. కార్తికేయ గురించి తాన్యా రవిచంద్రన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.