తెలుగమ్మాయంటే ఈజీగా కమిట్మెంట్ అడుగుతారు!

నటి తేజస్వి మదివాడ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ షోలో పాల్గొని తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత ఓ టీవీ షోలో కనిపించింది తేజస్వి. ఆ తరువాత అవకాశాలు రాక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో ‘కమిట్మెంట్’ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించే ఛాన్స్ తనకొచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.లక్ష్మీకాంత్ చెన్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో ఉండబోతుందని టీజర్ చూస్తేనే అర్ధమవుతోంది.

అయితే దర్శకుడు మాత్రం ఈ సినిమాతో సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజస్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమాలపై ఆసక్తిపోయి చిరాకుగా ఉన్న సమయంలో దర్శకుడు ఈ కథ చెప్పారని.. విన్న తరువాత తన లైఫ్ స్టోరీ అనిపించిందని.. అందుకే ఒప్పుకున్నానని తేజస్వి అన్నారు. సెక్స్ అనగానే మన ప్రవర్తన ఎలా మారిపోతుందో చెప్పే సినిమా అని.. ఈ సినిమాను డర్టీ మూవీలా కాకుండా మంచి విషయం ఉన్న సినిమాలా చూస్తే ప్రేక్షకులకు అర్ధమవుతుందని అన్నారు.

ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దుపెట్టుకోలేదని.. కానీ ఈ సినిమాలో శ్రీనాథ్ ను ముద్దుపెట్టుకున్నట్లు చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన తను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తేజస్వి చెప్పారు. తెలుగమ్మాయి అనగానే తీసి పడేస్తారని, తెలుగు అమ్మాయిలను కమిట్మెంట్ అడగడం చాలా ఈజీ అని అనుకుంటారని షాకింగ్ విషయాలు చెప్పారు. చాలా మంది తనను నేరుగా కమిట్మెంట్ అడిగారని తెలిపారు. అలాంటి కమిట్మెంట్ లు, వ్యక్తులను తప్పించుకొని వచ్చానని అన్నారు. చాలా మంది పెద్ద దర్శకులతో పని చేశానని.. చాలా చోట్ల ఇబ్బందిగా ఫీలయ్యాయని చెప్పారు. ఫైనల్ గా తన స్టోరీని ప్రేక్షకులకు చెప్పే ఛాన్స్ ఈ సినిమా ద్వారా వచ్చిందని వెల్లడించారు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus